హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసులో వైయస్ జగన్ రాజీనామా తుఫాను, రాజీనామాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్ జగన్, వైయస్ విజయలక్ష్మి రాజీనామాలు కాంగ్రెసు పార్టీలో తుఫాను సృష్టించింది. కాంగ్రెసు తీవ్ర కలకలం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం వైయస్ జగన్ అభిమానులు ఆందోళనలకు దిగుతున్నారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వైయస్ జగన్ అనుచరులు రాజీనామా బాట పడుతున్నారు. కడప కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. కడప జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) అధ్యక్షుడు సురేష్ బాబు తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. అనంతపురం జిల్లాలో వైయస్ జగన్ అనుచరులు భారీ ర్యాలీ తీశారు. అనంతపురం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. రాజీనామాలు చేయవద్దని వైయస్ జగన్ విజ్ఞప్తి చేసినప్పటికీ శాసనసభ్యులు కొంత మంది రాజీనామా బాట పట్టే అవకాశం ఉంది. శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని కొంత మంది శాసనసభ్యులు కూడా రాజీనామా బాట పట్టారు. దర్శి శాసనసభ్యుడు శివప్రసాద్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉంది. నల్లగొండ జిల్లా మైనార్టీ సెల్ అద్యక్షుడు సిరాజ్ ఖాన్ రాజీనామా చేశారు.

రాజీనామాలు చేయవద్దని వైయస్ జగన్ చెప్పారని, ఏం చేయాలనేది ఆలోచిస్తామని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. వైయస్ జగన్ మాటను వారు లెక్కలోకి తీసుకోకుండా రాజీనామా చేసేందుకు వారు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. శాసనసభ్యురాలు కొండా సురేఖ, ఆమె భర్త ఎమ్మెల్సీ కొండా మురళి రాజీనామా చేసే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. కడప జిల్లాలో శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రారెడ్డి మినహా మిగతావారంతా రాజీనామా చేస్తారని అంటున్నారు. ఢిల్లీ పార్లమెంటు హాల్లో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి తదితరులు చర్చలు జరిపారు. కర్నూలు జిల్లా నంద్యాల స్థానిక సంస్థల సభ్యులు రాజీనామాలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X