వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రొఫార్మా ప్రకారం లేనందున జగన్ రాజీనామా ఆమోదించలేదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడిగా వైయస్ జగన్మోహన్మోహన్ పంపిన రాజీనామా లేఖ ప్రొఫార్మా ప్రకారం లేనందున దానిని ఆమోదించలేదని స్పీకరు కార్యాలయం సోమవారం తెలిపింది. రాజీనామాను వ్యక్తిగతంగా వచ్చి కలిసి ఇస్తేనే ఆమోదిస్తామని కార్యాలయం తెలిపింది. రాజీనామాపై ఒత్తిడిగానీ, ఆవేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవటం వంటివి గానీ జరిగే అవకాశాలున్నందున స్పీకరు కార్యాలయం ఆమోదించలేదు. అంతేకాకుండా ఫ్యాక్సు ద్వారా పంపడం కూడా వివాదాలకు దారి తీస్తుంది. రాజీనామాను ఫ్యాక్సు చేసింది సభ్యుడే అన్న ఖచ్చితమైన సమాచారం ఉండది. కాబట్టి అలాంటి రాజీనామాను ఆమోదించే అవకాశం లేదు.

కాగా కిరణ్ కుమార్ రెడ్డి ఎంపిక క్రూయల్ గా జరిగినందువల్లనే జగన్ బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అధిష్టానానికి కొరకు రాని కొయ్యలా మారిన జగన్ ను చిత్తు చెయ్యడానికే రోశయ్యను తప్పించి ముఖ్యమంత్రి పీఠంపై కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం కూర్చుండబెట్టింది. జగన్ రాజీనామా చేసి పార్టీలోనుండి వెళ్లిపోయినా ఆయనతో పాటు ఎందరు వెళతారో అనే విషయాన్ని పార్టీ అధిష్టానం ముందుగానే అంచనా వేసినట్లు సమాచారం. అందుకే పరోక్షంగానైనా ఆయనపై చర్యలకే అధిష్టానం సిద్ధపడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X