వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అక్కసు వెళ్శగక్కిన టాటా టెలి, ఆర్ కామ్..

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

A Raja
న్యూఢిల్లీ: ప్రస్తుతం యావత్ భారతదేశం మొత్తం ఆసక్తికరంగా చూస్తున్న అతిపెద్ద కుంభకోణం 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం. గత కోన్నాళ్శుగా పార్లమెంట్ నుసైతం ఓకుదుపు కుదుపేస్తోంది ఈ2జి కుంభకోణం. దాదాపుగా లక్షా డెబ్బై ఆరువేల కోట్ల రూపాయలు నష్టం ప్రభుత్వానికి వచ్చినట్లు కాగ్ అంచనాలు సమర్పించిన విషయం అందరికి తెలిసిందే. ఐతే దీనిపై స్పందించినటువంటి వివిధ కంపెనీలు వారియొక్క అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. స్పెక్ట్రమ్ కేటాయింపులపై టాటా టెలిసర్వీసెస్ వారి అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ కంటే ముందుగా జీఎస్ ఎం ఆధారిత టెలికాం సేవలు ప్రారంభించినటువంటి పాత భారతీ, వోడాఫోన్, ఐడియాలకు ఎక్కువ 2జీ స్పెక్ట్రమ్ కేటాయించి నట్లు టాటా టెలి పేర్కోంది. అనేక సర్కిళ్లలో ఈమూడు కంపెనీలతో పోలిస్తే తమ జీఎస్ ఎం చందాదారుల సంఖ్యలో పెద్ద తేడా లేకపోయినప్పటికీ వాటికి ఎక్కువ స్పెక్ట్రమ్ కేటాయించినట్లు తెలిపింది. అంతేకాకుండా 2003 నుండి 2008 సంవత్సరాల మద్య వోడాఫోన్, భారతీ, ఐడియా, ఎయిర్ టెల్ వంటి జీఎస్ ఎం సేవల కంపెనీలకు ఉచితంగా 43.8మెగా హెర్జ్ స్పెక్ట్రమ్ కేటాయించినట్లు ప్రభుత్వానికి టాటా టెలిసర్వీసెస్ పత్రాలను సమర్పించింది.

వీరికి తోడుగా పాత జీఎస్ ఎం ఆపరేటర్లు ఎటువంటి ధర చెల్లించకుండా అదనపు 2జీ స్పెక్ట్రమ్ పోందినట్లు అనిల్ అంబానీ ఆద్వర్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ పేర్కోంది. అంతేకాకుండా ఇటీవల ఒక టీవీ ఛానెల్ కురతన్ టాటా ఇచ్చిన ఇంటర్వ్యూని సమర్దించింది. ఈఇంటర్వ్యూలో రతన్ టాటా మాట్లాడుతూ పాత జీఎస్ ఎం ఆపరేటర్లు స్పెక్ట్రమ్ నుతమ గుప్పెట్లో పెట్టుకున్నారని టాటా గ్రూప్ కంపెనీల అధిపతి రతన్ టాటా అన్నారు. అంతేకాకుండా అదనపు స్పెక్ట్రమ్ ఉన్న వారినుండి ఆదాయాన్ని రాబట్టాలని చూచించారు.

వీరికి సమాధానంగా వోడాఫోన్ తనదైన శైలిలో సమాధానం చెప్పింది. కోత్తగా జీఎస్ఎం టెలికాం సేవలను ప్రారంభించిన ఆపరేటర్లు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నయని చెప్పారు. నిబంధనలకు అనుగుణంగానే అదనపు స్పెక్ట్రమ్ పోందినట్లు తెలిపింది. గత దశాబ్దం కాలంగా చందాదారుల సంఖ్యకు అనుగుణంగా అపరేటర్లు ప్రభుత్వం స్పెక్ట్రమ్ కేటాయించిందని వివరించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X