హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా పార్టీ పేరును ఇంకా నిర్ణయించుకోలేదు: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తాను పెట్టబోయే పార్టీకి ఇంకా పేరు నిర్ణయించలేదని కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన వైయస్ జగన్ చెప్పారు. ఎన్డీటీవీతో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ఉద్దేశం తనకు లేదని, అందువల్లే రాజీనామాలు చేయవద్దని తన శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు సూచించానని ఆయన స్పష్టం చేశారు. వైయస్సార్ సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డికి హోం మంత్రిత్వ శాఖ ఇస్తారనే వార్తల నేపథ్యంలో తన కుటుంబాన్ని చీల్చడానికి కాంగ్రెసు అధిష్టానం కుట్ర చేసిందనే మనస్తాపంతో తాను రాజీనామా చేసినట్లు వైయస్ జగన్ చెప్పుకుంటున్నారు. తన వెనక జరుగుతున్న నీచ రాజకీయాలను తాను తట్టుకోలేకపోయానని జగన్ అన్నారు.

తనపై, తన కుటుంబంపై దుష్ప్రచారం సాగించారని, చివరకు తన తండ్రి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని కూడా వదిలిపెట్టలేదని ఆయన అన్నారు. ఓదార్పు యాత్ర చేసి తాను చేసిన తప్పేమిటని ఆయన అడిగారు. ఓదార్పు యాత్ర తన వ్యక్తిగతమని పదే పదే చెబుతూ వచ్చానని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X