హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పై దాడిని ముమ్మరం చేసిన కాంగ్రెసు నేతలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెసు నాయకులు దాడిని ముమ్మరం చేశారు. రాజీనామా చేసిన జగన్ వెంట ఎవరూ వెళ్లరని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధికార ప్రతినిధి తులసీరెడ్డి మంగళవారం అన్నారు. జగన్ వెంట వెళ్లడానికి ఏ శాసనసభ్యుడు, ఏ శాసనమండలి సభ్యుడు సిద్ధంగా లేరన్నారు. జగన్ రాజీనామాతో కాంగ్రెసు పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు. జగన్ రాజీనామా ఆయన వ్యక్తిగతమన్నారు. కడప పార్లమెంటునుండి అలాగే పులివెందుల శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన విజయలక్ష్మి స్థానం నుండి కూడా కాంగ్రెసు పార్టీయే గెలుస్తుందని ఆయన చెప్పారు.

జగన్ తీరు హిట్లర్ వ్యవహరించినట్లుగా ఉందని పాలడుగు వెంకట్రావు అన్నారు. జగన్ రాజీనామాతో పార్టీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మరణించగానే ఇందిరాగాంధీ ప్రధాని కాలేదన్నారు. ఎనరికైనా కాస్త ఓపిక ఉండారన్నారు. జగన్ కు పార్టీ పెట్టే హక్కు ఉందని, అయితే సోనియాను విమర్షించి, ఫ్లెక్సీలు ధ్వంసం చేసే హక్కు మాత్రం లేదని మేడ్చల్ శాసనసభ్యుడు కె లక్ష్మారెడ్డి(కెఎల్ఆర్) అన్నారు. కిరణ్ తోనే కొత్త ఎమ్మెల్యేలు ఉంటారని, కొత్తవారికి మంత్రి పదవులు ఇవ్వడంలో తప్పులేదన్నారు.

తనకు మంత్రి పదవి ఫరవాలేదని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ తో వెళితే నీళ్లులేని బావిలో దూకినట్లేనన్నారు. వివేకానంద ఉన్న పార్టీలోనే ఉంటే మోసం చేసినట్టు, జగన్ బయటకు వెళ్లిపోవటం ఒప్పు చేసినట్టా అని అన్నారు. వైయస్ వివేకానంద ప్రకటనను ఆహ్వానిస్తున్నట్టు మాజీమంత్రి దామోదరరెడ్డి అన్నారు. జగన్ తీరు ప్రజాస్వామ్యయుతంగా లేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X