హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్మోహన్ రెడ్డిది తొందరబాటు చర్య: కోటగిరి విద్యాధరరావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kotagiri Vidyadhar Rao
హైదరాబాద్: నిన్నగాక మొన్న పార్లమెంటులోకి అడుగు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి అంత తొందరపాటు చర్య పనికి రాదని ప్రజారాజ్యం సీనియర్ నాయకుడు కోటగిరి విద్యాధరరావు ఓ టీవి ఛానల్లో ఫోన్ లో మాట్లాడుతూ చెప్పారు. తనకు, తన కుటుంబానికి ఇంతటి ప్రాధాన్యత తెచ్చిన కాంగ్రెస్ పార్టీని గౌరవించాల్సింది పోయి ఇలా చేయటం సరికాదన్నారు. అంబటి రాంబాబు అంత సీనియర్ నాయకుడు అయి ఉండి జగన్ కు సర్ది చెప్పవలసినది పోయి ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. అంబటి ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి తమ్ముడు నాగబాబుపై చేసిన ఆరోపణలు సరికావన్నారు.

పార్టీ పెట్టకముందు విషయాలను పార్టీ పెట్టిన తర్వాత వాటిగా ఆపాదించడం సరికాదన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉండమని ప్రజలు తీర్పునిస్తే కాంగ్రెస్ మద్దతు ప్రకటించడమేమిటని జగన్ వర్గం సభ్యులు మాకు చెప్పే వారు కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏ సమస్య వచ్చినా మద్దతునిస్తామన్నారు. అయితే జగన్ సమస్యతో మాకు సంబంధం లేదన్నారు. జగన్ సమస్య నిన్న మొన్న వచ్చిందని, కాని తాము ఎప్పటినుండో ప్రజలకోసం ఆలోచించే పార్టీగా మద్దతు ఇస్తామని చెబుతున్నామన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం అందువల్లనే చెప్పామన్నారు. మళ్లీ ప్రజలను ఎన్నికలకు తీసుకుపోయి భారం మోపే ఉద్దేశ్యం ప్రజారాజ్యం పార్టీకి లేదన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని బెర్తులు ప్రజారాజ్యం కోసం ఉంచారని చెప్పడం ఆయన తమ పార్టీకి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నామని, అందుకు తాము సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఎన్నికలకు ముందు తాము సామాజిక తెలంగాణ అన్నప్పటికీ ఎన్నికల తర్వాత ప్రజాభిప్రాయం ప్రకారమే సమైఖ్యంద్ర నినాదాన్ని ఎత్తుకున్నామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X