వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ రాజీనామాను ఆమోదించిన స్పీకర్ మీరాకుమార్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: కడప లోకసభ సభ్యత్వానికి వైయస్ జగన్‌ చేసిన రాజీనామాను లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ శుక్రవారం ఆమోదించారు. జగన్‌ తన రాజీనామా లేఖను ఫ్యాక్స్‌ ద్వారా సోమవారం స్పీకర్‌కు పంపిన సంగతి తెలిసిందే. ఆమె శుక్రవారం ఆమోదించారు. ముఖ్యమంత్రిగా రోశయ్య రాజీనామా, కిరణ్‌కుమార్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం తదనంతర పరిణామాల నేపథ్యంలో తన కుటుంబానికి అన్యాయం జరిగిందని పేర్కొంటూ జగన్‌ పార్టీ అధినేత్రికి లేఖ రాశారు. దాంతోపాటే తన రాజీనామా పత్రాన్ని కూడా పంపారు.

పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైయస్ జగన్ హైదరాబాదులో కొత్త పార్టీ స్థాపనపై కసరత్తు చేస్తున్నారు. ఆయనను పలువురు నాయకులు వచ్చి కలుస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు మోజెస్ రాజా రాజీనామా చేసి వైయస్ జగన్ శిబిరంలో చేరేందుకు సిద్ధపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X