వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్రపై ఉత్తరాంధ్రవాసుల కన్నెర్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rakta Charitra 2
విశాఖపట్నం: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో శుక్రవారం విడుదలవుతున్న రక్త చరిత్ర-2పై ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చిత్రంలో ఫ్యాక్షనిజానికి పేరొందిన అనంతపుర్ పేరుకు బదులుగా ప్రశాంతతకు, పచ్చదనానికి, ఎలాంటి కుతంత్రాలు ఉండని ఉత్తరాంధ్రకు చెందిన ఆనందపురం పేరును వాడుకోవడంపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్రంలో వెంటనే ఆనందపురం పేరును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రక్త చరిత్రను అడ్డుకుంటామన్నారు.

విశాఖపట్టణంలోని శ్రీకన్న థియేటర్లో రక్త చరిత్ర పోస్టర్ ను తగులపెట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. ప్రశాంత వాతావరణం ఉన్న ప్రాంతాన్ని కక్ష్యలకు, కారుణ్యాలకు పేరుగాంచినదిగా చూపించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఉత్తరాంధ్ర పరిరక్షణ సమితి పేర్కొంటున్నారు. ఆ పేరును తొలగించకుంటే చిత్రాన్ని అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా థియేటర్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కొన్ని ప్రాంతాలలో మధ్యాహ్నం చిత్రం విడుదల కానుంది.

కాగా చిత్రంలో పరిటాల రవిగా వివేక్ ఒబేరాయ్, మద్దెలచెర్వు సూరిగా సూర్య, భానుమతి పాత్రలో ప్రియమణి, చమన్ గా సిరిలు నటిస్తున్నారు. ఎకే అనే పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. ఎకే అంటే అనంతపురం కింగ్. ఈ పాత్రలో సుబబ్రత నటిస్తున్నారు. కాగా రక్త చరిత్ర చిత్రాన్ని వర్మ నేటివిటీ కోసం చాలా వరకు ఆయా ప్రాంతాలలోనే తీయటం గమనార్హం. జూబ్లీహిల్స్ బాంబు పేలుడు సంఘటన కోసం భారీ సెట్ వేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X