హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ శిబిరం అస్త్రంగా వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్‌: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదాన్ని వైయస్ జగన్ వర్గం మళ్లీ ముందుకు తెస్తోంది. ఆ హెలికాప్టర్ ప్రమాదంపై సందేహాలను వ్యక్తం చేస్తోంది. వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో కుట్ర దాగి ఉందనే సందేహాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదంపై సిబిఐ విచారణను తప్పు పడుతున్నారు. వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదంపై తెలుగు ప్రజలు సందేహాలను తట్టుకోలేకపోతున్నారని అంబటి రాంబాబు శనివారం అన్నారు. వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదం కేసును సిబిఐ హడావిడిగా ముగించిందని ఆయన విమర్శించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన నిజాలు వెలుగు చుస్తాయని అన్నారు.

వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖ కూడా వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదాన్ని ప్రధానంగా ఇటీవల ప్రస్తావించారు. ప్రమాదంపై పలు అనుమానాలున్నాయని ఆమె అన్నారు. వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాను పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో కూడా వైయస్ జగన్ ప్రధానంగా ప్రస్తావించారు. వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలను నివృత్తి చేయలేకపోయారని ఆయన అన్నారు. దీన్ని బట్టి వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదాన్ని వైయస్ జగన్ కొత్త పార్టీ కాంగ్రెసుపై ఓ అస్త్రంగా సంధిస్తుందనేది అర్థమవుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X