హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పర్వతనేని ఉపేంద్ర విగ్రహావిష్కరణలో మాజీ సిఎం రోశయ్య, చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah-Chiranjeevi
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, ప్రజారాజ్యం వ్యవస్థాక అధ్యక్షుడు చిరంజీవి ఆదివారం ఒకచోట కలుసుకున్నారు. దివంగత కాంగ్రెస్ నాయకుడు పర్వతనేని ఉపేంద్ర విగ్రహాన్ని కొణిజేటి రోశయ్య బంజారాహిల్స్ లో ఆదివారం ఉదయం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి కూడా వచ్చారు. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టేకంటే ముందు రోశయ్య, చిరంజీవి ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉంటే చిరంజీవి మంత్రివర్గంలో చేరడం దాదాపు ఖరారయ్యింది. కాని రోశయ్య రాజీనామాతో చిరంజీవి సైతం అవాక్కయ్యారు. రోశయ్య రాజీనామాతో చిరంజీవి తీవ్రంగా అసంతృప్తికి లోనైన విషయం అందరికీ తెలిసిందే.

కాని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చిరంజీవి కాంగ్రెస్ అవసరమైతే బయటనుండి మద్దతు ఇస్తామని చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సీపీఎం రాష్ర్ట కార్యదర్శి రాఘవులు, బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు, టీడీపీ నేత ఎరన్న్రాయుడు హాజరయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X