వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నర్సుల ఆందోళనకు దిగివచ్చిన ప్రభుత్వం: ఆందోళన విరమణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Warangal
వరంగల్: తమను క్రమబద్దీకరించాలంటూ మూడురోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న నర్సుల ఆందోళనకు ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. సోమవారం మధ్యాహ్నం వైద్యశాఖ డిడి నర్సులతో చేసిన చర్చలు సఫలమయ్యాయి. నర్సుల డిమాండ్లకు డిడి సానుకూలంగా స్పందించారు. దీంతో నర్సులు తమ ఆందోళన విరమించుకున్నారు. నర్సులను క్రమబద్దీకరించడంతో పాటు వారిపై పెట్టిన కేసులను కూడా ఎత్తివేస్తామని చెప్పారు. నర్సుల భర్తలపై పెట్టిన కేసులను కూడా ఎత్తేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

దీంతో ఈనెల 12న జరగాల్సిన పరీక్షలను ప్రభుత్వం 19వ తేదికి వాయిదా వేసింది. ఇంతకుముందు కూడా నర్సులు పలుమార్లు ఆందోళన నిర్వహించినప్పుడు మంత్రి పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్ లు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఇంతవరకు నెరవేరక పోవడంతో వారు మళ్లీ ఆందోళన చేపట్టారు. తమ ఉద్యోగాలు క్రమబద్దీకరించాలంటూ నీళ్ల ట్యాంకు ఎక్కి ఆందోళన చేశారు. నర్సుల ఆందోళన సోమవారం ఉద్రిక్తంగా మారింది. పోలీసుల వచ్చి ట్యాంకుపైనున్న నర్సులను దింపే ప్రయత్నాలకు పూనుకున్నారు. అయితే కింద ఆందోళన చేస్తున్న వారు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు బలవంతంగా వెళ్లడానికి ప్రయత్నాలు చేయడంతో ఇద్దరు నర్సులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఒక నర్సు బ్లేడుతో చేతిపైన కోసుకున్నది. మరో నర్సు కిరోసిన్ ఒంటిపైన పోసుకొని అత్యహత్యాయత్నానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు వారించారు. దీంతో పోలీసులు పైకి ఎక్కకుండా ఆగిపోయారు. కాగా అధికారులు మాత్రం నర్సులను సంప్రదించలేదు. క్రమబద్దీకరణ అనేది మా చేతుల్లో లేదని వారు చేతులెత్తేస్తున్నారు. కాగా ప్రభుత్వ దిగి వచ్చే వరకు తమ ఆందోళన ఆపేది లేదని మరోవైపు నర్సులు అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X