హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు అనుకూలమైతే వైయస్ జగన్ కు జై కొడ్తాం: ఆర్ దామోదర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

R Damodar Reddy
హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే వైయస్ జగన్ పార్టీని తాము స్వాగతిస్తామని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి అన్నారు. తెలంగాణకు పరోక్షంగా గానీ ప్రత్యక్షంగా గానీ మద్దతిచ్చినా తాము జగన్ సహకారం తీసుకుంటామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తాము ఇప్పటి వరకు కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి విధేయులమని, తెలంగాణ అంశానికి వస్తే తాము పార్టీని, ఎజెండాను పక్కన పెడతామని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఏ పార్టీ, ఏ వ్యక్తీ ముందుకు వచ్చినా తాము స్వాగతిస్తామని ఆయన చెప్పారు. డిసెంబర్ 31వ తేదీ వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఢోకా లేదని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా వస్తే ఈ ప్రభుత్వ మనుగడ ఎలా ఉంటుందో చెప్పలేమని ఆయన అన్నారు. తనకు కాంగ్రెసు పార్టీలో ఉంటూనే తెలంగాణ రాష్ట్రం కావాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X