కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పులివెందుల నుంచి విజయమ్మ పోటీ: మారిన జగన్ వ్యూహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Ysr and Vijayalaxmi
కడప: ఉప ఎన్నికల్లో పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి, వైయస్ జగన్ తల్లి వైయస్ విజయమ్మనే పోటీ చేస్తారు. కడప లోకసభ స్థానం నుంచి వైయస్ జగన్ పోటీ చేస్తారు. మంగళవారం సాయంత్రం లింగాల మండలం కార్యకర్తల సమావేశంలో వైయస్ జగన్ ఈ విషయాన్ని ప్రకటించారు. పులివెందులకు విజయమ్మ, కడప లోకసభ స్థానానికి వైయస్ జగన్ రాజీనామా చేయడం చేయడం వల్ల ఆ రెండు స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. తన పార్టీని 45 రోజుల తర్వాత పులివెందులలోని వైయస్సార్ సమాధి వద్ద ప్రకటిస్తానని ఆయన చెప్పారు. తమ చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డిని రెచ్చగొట్టి, పదవి ఆశ చూపి తమ కుటుంబాన్ని కాంగ్రెసు అధిష్టానం చీల్చిందని ఆయన ఆరోపించారు.

కాగా, తాజాగా వైయస్ జగన్ వ్యూహం మారినట్లు కనిపిస్తోంది. పులివెందుల స్థానం నుంచి తాను పోటీ చేసి, కడప పార్లమెంటు సీటు నుంచి తన సోదరి షర్మిళను పోటీకి దించాలని మొదట ఆయన అనుకున్నారు. అయితే, చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసు పార్టీతోనే ఉండాలని నిర్ణయించుకోవడంతో వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. పులివెందులలో తాను పోటీ చేస్తే కాంగ్రెసు అధిష్టానం తనపై చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డిని పోటీకి దించవచ్చునని, అందుకు వివేకానంద రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేయవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వైయస్ విజయమ్మ పోటీ చేయడానికి వైయస్ వివేకానంద రెడ్డి ముందుకు రారనే అభిప్రాయం జగన్ లో ఉన్నట్లు సమాచారం. వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసులో ఉండడం వల్ల ఈ రెండు స్థానాల్లో కూడా తాను పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందువల్ల స్థానాలు మారకపోవడం మంచిదని ఆయన భావించినట్లు సమాచారం.

English summary
Late YSR wife YS Vijayamma will contest from Pulivendula assembly seat in bye polls. YS Jagan decided to contest from Kadapa loksabha constituency. this annouced by YS Jagan himself at Pulivendula meeting on tuesday. These two seats were fell vacant as YS Vijayamma and YS Jagan resigned. His party will be launched at Pulivendula after 45 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X