విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీలక్ష్మి హంతకుడు మనోహర్ కు మరణశిక్షకు సుప్రీం నిరాకరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Supreme Court
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీలక్ష్మిని హత్య చేసిన మనోహర్ కు మరణశిక్ష విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ ను సుప్రీంకోర్టు బుధవారం తోసి పుచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మనోహర్ ను జీవితఖైదుగా కొనసాగించాలని తీర్పు చెప్పింది. గతంలో హైకోర్టు మనోహర్ కు మరణ శిక్షను రద్దు చేస్తూ జీవితఖైదును వేస్తూ తీర్పు చెప్పింది. దానిని సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

2004 జూన్ మాసంలో మనోహర్ శ్రీలక్ష్మిని విజయవాడలో దారుణంగా చంపాడు. ఆ తర్వాత మనోహర్ అదే నెల 30వ తారీఖున చెన్నై కమిషనర్ ముందు లొంగిపోయాడు. 2007 ఆగస్టు 7న విజయవాడ మహిళా సెషన్సు కోర్టు మనోహర్ కు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీనిని మనోహర్ తరఫున న్యాయవాది హైకోర్టులో సవాలు చేశారు. అక్టోబర్ 30వ తారీఖున హైకోర్టు మహిళా కోర్టు వేసిన మరణశిక్షను రద్దు చేస్తూ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై శ్రీలక్ష్మి కుటుంబం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X