హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ వర్షాల కారణగా తెరాస మహాగర్జన 16కు వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి గురువారం వరంగల్లో నిర్వహించ తలపెట్టిన మహాగర్జనకు వర్షం అడ్డంకిగా మారింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రేపు జరగాల్సిన బహిరంగ సభను ఈనెల 16వ తేదికి వాయిదా వేస్తున్నట్లు తెరాస ప్రకటించింది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అయితే మంగళవారం వాతావరణశాఖ వాయుగుండం తీరం దాటిందని ప్రకటించడంతో తెరాస నాయకులు సభకు ఎలాంటి అడ్డంకులు ఉండవని అనుకున్నారు. కానీ వర్షాలు భారీగా కురుస్తుండటం అడ్డంకిగా మారింది. ఈ సభకు ఇప్పటికే ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి.

కాగా గురువారం రోజునే తెలంగాణ ప్రజా ఫ్రంట్ కన్వీనర్, ప్రజా గాయకుడు సైతం హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో మరో బహిరంగసభను నిర్వహించ తలపెట్టారు. కేసిఆర్ కు పోటీగా సభను నిర్వహిస్తున్నరని పలువురు చెప్పినప్పటికి గద్దర్ తోపాటు కేసిఆర్ ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఎవరికి ఎవరూ పోటీ కాదని తెలంగాణ కోసం ఎవరి పోరు వారు చేయవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసిఆర్ మహాగర్జన ను వాయిదా వేయడానికి కారణం గద్దర్ నిర్వహించ తలపెట్టిన బహిరంగసభనా, లేక వాతావరణమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇప్పటికే ఎస్సీ రిజర్వేషన్ కోసం తాను చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలపని కేసిఆర్ మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ గద్దర్ ఏర్పాటు చేసిన బహిరంగసభకు వెళ్లాలని, కేసిఆర్ మహాగర్జనకు ఎవరూ వెళ్లవద్దని మాదిగలకు పిలుపును కూడా ఇచ్చారు. మహాగర్జనకు జాతీయస్థాయిలో అగ్నివేష్ వంటి పలువురు నేతలను కూడా ఆహ్వానించారు. అయితే భారీ వర్షాల కారణంగా వాయిదా పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X