హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివేకాది ఆత్మగౌరవం కాదు, జగన్ దే ఆత్మగౌరవమా: తులసీరెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tulasi Reddy
హైదరాబాద్: తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి శవాన్ని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి కోసం ప్రజారాజ్యం పార్టీ చుట్టూ తిరిగిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సచ్ఛీలత గురించి అందరికీ తెలుసునని కాంగ్రెసు అధికార ప్రతినిధి తులసీరెడ్డి బుధవారం ఘాటు విమర్శలు చేశారు. వైయస్ జగన్ సంపాదించిన అక్రమ ఆస్తుల గురించి ప్రజలు కథలుకథలుగా చెప్పుకుంటున్నారన్నారు. పార్లమెంటు సభ్యుడిగానే ఇన్ని ఆస్తులు కూడబెట్టిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయితే ఇంకా ఎన్ని ఆస్తులు కూడబెడతాడోనని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారన్నారు.

వైయస్ అన్ని అక్రమ ఆస్తులు సంపాదించుకున్నప్పటికీ పార్టీలోని వ్యక్తి కావటంతో ఇన్నాళ్లు బహిరంగంగా మాట్లాడలేకపోయామని అన్నారు. జగన్ చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఆత్మగౌరవం లేనట్టు, జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే మాత్రం ఆత్మగౌరవం ఉన్నట్టా అని తులసీరెడ్డి ప్రశ్నించారు. చిన్నాన్నకు మంత్రి పదవి ఇస్తే సంతోషించాల్సింది పోయి జగన్ ఇలా చేయటం సరికాదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X