హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్యాంధ్ర, తెలంగాణ విద్యార్థుల కేసులపై జెపి భిన్న వాణి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
హైదరాబాద్: సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యామాల కారణంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షాలతో పాటు అధికారపక్ష నాయకులు సైతం డిమాండు చేస్తున్న తరుణంలో కేవలం లోక్ సత్తా మాత్రం తన వాణిని అందుకు విరుద్దంగా వినిపించింది. విద్యార్థులపై చిన్న చిన్న కేసులను ఎత్తివేయాలని, దగ్ధం చేయడాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడడాలు, దాడులు చేయడాలు వంటి పెద్ద పెద్ద వాటిపై కేసులు ఎత్తివేయాల్సిన అవసరం లేదన్నట్టూ లోక్ సత్తా పార్టీ శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ అన్నారు.

అలా చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. శాంతిభద్రతల కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని ఆయన అన్నారు. జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు తమ నిరసన తెలిపాయి. జెపి మాట్లాడేటప్పుడు వారు నినాదాలు చేశారు. స్పీకరు నాదెండ్ల మనోహర్ వారికి సర్ది చెప్పాల్సి వచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X