హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీలో జెపి వ్యాఖ్యలపై భగ్గుమన్న ఓయు విద్యార్థులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యామాల కారణంగా విద్యార్థులపై పెట్టిన కేసులపై లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ చేసిన వ్యాఖ్యలపై ఉస్మానియా ఐక్యకార్యాచరణ సమితి భగ్గుమంది. జెపి వ్యాఖ్యలు తెలంగాణ విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్నాయని ఐకాస ధ్వజమెత్తింది. కాగా విద్యార్థుల కేసుల ఎత్తివేతకు వ్యతిరేకంగా మాట్లాడిన జెపికి ఎక్కువ సమయం ఎందుకు కేటాయించడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు హరీష్ రావు సభాపతిని ప్రశ్నించారు.

కాగా అంతకుముందు విద్యార్థులపై చిన్న చిన్న కేసులను ఎత్తివేయాలని, దగ్ధం చేయడాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడడాలు, దాడులు చేయడాలు వంటి పెద్ద పెద్ద వాటిపై కేసులు ఎత్తివేయాల్సిన అవసరం లేదన్నట్టూ లోక్ సత్తా పార్టీ శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. అలా చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. శాంతిభద్రతల కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చని ఆయన అన్నారు. జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలు తమ నిరసన తెలిపాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X