హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రభాకర్ అలక: రాజీనామా హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Prabhakar
హైదరాబాద్: తెలుగుదేశం దెందులూరు శాసనసభ్యుడు ప్రభాకర్ శాసనసభ భద్రతా సిబ్బంది తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రాజీనామా చేస్తానని హెచ్చరించారు. రైతు సమస్యల తీవ్రతను తెలియజెప్పేందుకు ప్రతీకాత్మకంగా వరికంకులతో ఆయన శాసనసభలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది ఆ వరికంకులను లాక్కున్నారు. దాంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది తనను అవమానపరిచారని, తనకు క్షమాపణ చెప్పే వరకు సభలోకి వచ్చేది లేదని, తాను రాజీనామా చేస్తానంటూ ఆయన అక్కడే బైఠాయించారు.

తెలుగుదేశం ఇతర శాసనసభ్యులు వచ్చి సర్దిచెప్పినా ఆయన వినలేదు. తనను అవమానించినందుకు క్షమాపణ చెప్పాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. సభలో స్పీకర్ తోనే తేల్చుకుందామని తోటి శాసనసభ్యులు చెప్పారు. అయినా వినకపోవడంతో తెలుగుదేశం శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను కలిశారు. ఆయన హామీ ఇవ్వడంతో ప్రభాకర్ లోనికి వచ్చారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డిని కూడా భద్రతా సిబ్బంది లోనికి వెళ్లనీయలేదు. దీంతో ఆయన ఓ నమస్కారం పెట్టి సిఎల్పీ కార్యాలయంలోకి వెళ్లిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X