హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణే చివరి ముఖ్యమంత్రి: కేసుల ఎత్తివేతపై చర్చలో గుండా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gunda Mallesh
హైదరాబాద్: రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటూ సిపిఐ శాసనసభ్యుడు గుండా మల్లేష్ సోమవారం అసెంబ్లీలో విద్యార్థుల కేసుల ఎత్తివేత సందర్భంగా వ్యాఖ్యానించారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయడం అభినందనీయమే అయినప్పటికీ అన్ని కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులు అందరూ ఏకత్రాటిపై నిలబడి బయటకు రావడానికి గల కారణాలు ప్రభుత్వమేనన్నారు. తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అంటూ విద్యార్థులను రెచ్చగొట్టి తర్వాత వారిపై కేసులు పెట్టడం సరికాదన్నారు. తెలంగాణను ప్రభుత్వమే ప్రధాన సమస్యగా తయారు చేసిందన్నారు.

ఎందరో విద్యార్థులు ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకున్న సంఘటన భారతదేశ చరిత్రలోనే లేదన్నారు. ప్రాంతాలకతీతంగా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో విద్యార్థులపై పెట్టిన అన్ని కేసులు ఎత్తివేయాలన్నారు. కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై నమ్మకమున్నదని ఆయన అన్నారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి రోడ్డుపైన ధర్నా చేశారని, మంత్రులు కమిషనరేట్ దగ్గరలో రోడ్డుపై బైఠాయించారని వారిపై కేసులు పెట్టనిది విద్యార్థులపై ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు క్యాంపస్ లో శాంతియుతంగా ధర్నాలు చేశారు. కానీ రోడ్డెక్కి హింసకు పాల్పడలేదన్నారు. ప్రాంతాలకతీతంగా కేసులు ఎత్తివేయాలని ఆయన కోరారు.

చిన్న కేసులు ఉపసంహరించుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టు లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ చెప్పారు. ఉపసంహరించిన కేసుల్లో, ఉపసంహరించని కేసుల్లో కొద్దిగా అవకతవకలు ఉన్నాయన్నారు. అక్రమ కేసులు అంటూ సభలో పలుమార్లు వాదనలు వినిపిస్తున్నాయన్నారు. పోలీసులపై, పాలనపై నమ్మకం ఉంటాలన్నారు. అయితే అక్రమ కేసులు నిజమే అయితే అలాంటి కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరాడారు. కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం విద్యార్థులు బలికావద్దన్నారు. ఏదైనా చేయాలనుకున్న శాంతియుతంగా చేయాలని కోరారు. మీ భవిష్యత్తును చూసుకోవాలన్నారు.

విద్యార్థులను రాజకీయ నాయకులే రెచ్చగొట్టారని అలాంటప్పుడు విద్యార్థులపై కాకుండా వారిని రెచ్చగొట్టిన రాజకీయ నాయకులపై కేసులు పెట్టాలని సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేసారు. సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాలకు పాలకుల విధానమే కారణమన్నారు. ప్రాంతీయ వైషమ్యాలను పెంచి పోషించింది ఈ సభలేని వారేనని ఆరోపించారు. శాసనసభ్యత్వానికి, మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన యువతను రెచ్చగొట్టిన వారిపై చర్చలు తీసుకోవాలని ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X