వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వాతి వీక్లీలో ఆస్తి తగాదాలు: చీఫ్ ఎడిటర్ పై సిపికి ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Swathi Weekly
విజయవాడ: అనతి కాలంలోనే విశేష ఆదరణ పొందిన స్వాతి వీక్లీలో ఆస్తి తగాదాలు చోటు చేసుకున్నాయి. వత్రిక ప్రధాన సంపాదకుడు వేమూరి బలరామ్ పై అల్లుడు, కూతురు, భార్య తిరగబడినట్లు తెలుస్తోంది. బలరామ్ లేని సమయంలో స్వాతి కార్యాలయాన్ని అల్లుడు, కూతురు స్వాధీనం చేసుకున్నారు. వేమూరి బలరామ్ తల్లిని నిర్బంధించినట్లు ప్రచారం జరుగుతోంది. వేమూరి బలరామ్ పై భార్య, అల్లుడు విజయవాడ పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

వేమూరి బలరామ్ పై తమపై దాడి చేయించే ప్రమాదం ఉందని వేమూరి అల్లుడు, కూతురు, భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరుడు ఎక్కుడున్నాడో తెలియదని వేమూరి బలరామ్ సోదరుడు వెంకయ్య అంటున్నారు. పోలీసులు, రౌడీల సాయంతో స్వాతి వీక్లి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X