వైయస్ జగన్ ఎఫెక్ట్: కృష్ణా జిల్లా కాంగ్రెసు సీనియర్ల మంత్రాంగం

వైయస్ జగన్ వైపు కృష్ణా జిల్లాలోని కాంగ్రెసు ద్వితీయ శ్రేణి నాయకులు, యువకులు వెళ్లడానికి ఉద్యుక్తులవుతున్నారు. దీన్ని కట్టడి చేయడానికి అనుసరించాల్సిన విధానాలపై వారు చర్చించారు. రైతు సమస్యలపై ఈ నెల 21, 22 తేదీల్లో విజయవాడలో వైయస్ జగన్ నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో తమ పార్టీకి చెందినవారు దానికి దూరంగా ఉండేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా వారు చర్చించారు. అయితే, వైయస్ జగన్ గురించి గానీ వైయస్ జగన్ వైపు వెళ్లే నాయకుల గురించి తాము చర్చించడం లేదని దేవినేని నెహ్రూ చెప్పినప్పటికీ చర్చ అంతా వైయస్ జగన్ ప్రభావంపైనే పడినట్లు చెబుతున్నారు.