హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ను ఆయన నివాసంలో కలిసిన పేర్ని నాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Perni Nani
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన రెడ్డిని మంగళవారం నివాసంలో తన అనుచర వర్గంతో భేటీ అయ్యారు. శాసనసభ్యులు పేర్ని నాని, అమర్ నాథ్ రెడ్డి, మేకపాటి, శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ అసమ్మతి శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వైవి రెడ్డి, శాసనమండలి సభ్యురాలు పుల్లా పద్మావతి, మాజీ ఎమ్మెల్యేలు గోవింద రెడ్డి, గోనె ప్రకాశరావు తదితరులు కలిశారు.

గుంటూరు, కృష్ణా జిల్లాలో పంట నష్టపోయిన రైతులను పరామర్షించడానికి జగన్ వెళ్లి విషయం తెలిసిందే. వారిని పరామర్శించి హైదరాబాదుకు వచ్చిన నేపథ్యంలో వారు ఇక్కడకు వచ్చి కలిశారు. జగన్ హైదరాబాద్ వస్తున్నాడని తెలిసి పెద్ద ఎత్తున వైయస్ జగన్ అభిమానులు ఆయన ఇంటివద్దకు చేరుకున్నారు. విశాఖపట్నం కార్పోరేటర్లు కూడా కలిసినట్లు సమాచారం. కాగా అనంతరం పేర్ని సిఎంతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ ను వీడటం లేదని స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X