చంద్రబాబు నాయుడు తెలంగాణ అసెంబ్లీ హైదరాబాద్ chandrababu naidu telangana assembly vinay bhaskar hyderabad
చంద్రబాబు కెంత చిన్నచూపో: మండిపడుతున్న తెలంగాణ వర్గాలు

చంద్రబాబునాయుడికి తెలంగాణ అంటే ఎప్పుడూ చిన్నచూపే అని తెరాస శాసనసభ్యుడు వినయ భాస్కర్ ఆరోపించారు. చంద్రబాబు బూట్లతోనే అక్కడ నిలబడి తెలంగాణపై తనకున్న వ్యతిరేకతను మరోసారి నిరూపించుకున్నారన్నారు. చంద్రబాబు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై కేసుల ఎత్తివేత, పంట నష్టపోయిన రైతులకు పరిహారం విషయంలో ప్రభుత్వం వైఖరికి నిరసనగా తెలుగుదేశం పార్టీ సభ నుండి వాకౌట్ చేసి గన్ పార్కు వద్ద నిరసన తెలిపింది.