కాంగ్రెసు ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి ఇంట్లో జగన్ మంతనాలు

గురువారం సాయంత్రం ఆయన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు అనంత వెంకట్రామిరెడ్డి నివాసంలో ఆ పార్టీ నాయకులతో సమావేశమై తాను పెట్టబోయే పార్టీ గురించి మంతనాలు జరిపారు. అనంత వెంకట్రామి రెడ్డి ఇటీవలి దాకా వైయస్ జగన్ కు మద్దతు పలుకుతూ వచ్చారు. కానీ ఇటీవల ఆయన మౌనంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అనంత వెంకట్రామిరెడ్డి నివాసంలో జగన్ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ఇదిలా వుంటే, గుంటూరులో వైయస్ జగన్ వర్గీయులు కొత్త పార్టీ గురించి మంతనాలు జరుపుతున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన భూమన కరుణాకర్ రెడ్డి, అప్పిరెడ్డి, అంబటి రాంబాబు ఐబి గెస్ట్ హౌస్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి కూడా హాజరయ్యారు. గుంటూరు జిల్లాలో వీరు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.