వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు బెయిల్, విడుదల

By Pratap
|
Google Oneindia TeluguNews

Julian Assange
లండన్‌: వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజే బెయిల్‌పై విడుదలయ్యారు. స్వీడన్‌ అత్యాచార కేసులో అరెస్టయిన అసాంజే తొమ్మిది రోజులుగా జైల్లోనే ఉన్నారు. సుమారు 1.70 కోట్ల పూచీకత్తుతో అసాంజేకు బ్రిటన్‌ న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయన గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. తన మీద నమ్మకం ఉంచిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రేప్, అత్యాచార యత్నం కేసుల్లో అస్ట్రేలియాకు చెందిన అసాంజేను బ్రిటన్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అసాంజే ఇంటర్నెట్ వాడకంపై న్యాయస్థానం ఏ విధమైన షరతులు పెట్టలేదు. వికీలీక్స్ అమెరికా రహస్యాలను బయట పెడుతూనే ఉన్నది. అమెరికా విదేశాంగ శాఖకు చెందిన 2 లక్షల 50 వేల పత్రాల్లో లక్షా 621 పత్రాలను మాత్రమే వికీలీక్స్ బయటపెట్టింది. తాను తిరిగి పని ప్రారంభించగలనని ఆశిస్తున్నట్లు అసాంజే విడుదల అనంతరం చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X