వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాషాయ ఉగ్రవాదంపై రాహుల్ గాంధీ భయాలు: వికీలీక్స్ వెల్లడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
న్యూఢిల్లీ‌: భావి ప్రధానిగా భావిస్తున్న ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి సంబంధించిన రహస్యాలను వికీలీక్స్ బయటపెట్టింది. భారతదేశంలో అమెరికా రాయబారి టిమోతి రీమోర్స్ తో రాహుల్ గాంధీ జరిపిన సంభాషణను వికీలీక్స్ వెల్లడించింది. లష్కరే తోయిబా కన్నా హిందూ తీవ్రవాదం ప్రమాదకరంగా పరిణమించిందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ గ్రూపుల పెరుగుదల వల్ల ముస్లింలతో మతపరమైన, రాజకీయపరమైన ఘర్షణలు పెరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన విందు సందర్భంగా రాహుల్ కు, రిమోర్ కు మధ్య సంభాషణ జరిగింది.

లష్కరే తోయిబాకు దేశంలోని కొన్ని ముస్లిం గ్రూపుల నుంచి మద్దతు లభిస్తోందని ఆయన చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వంటి సంఘటిత హిందూ నాయకులు ఉద్రిక్తతలకు కారణమవుతున్నారని ఆయన అన్నారు. ర్యాడికల్ హిందూ గ్రూపుల నుంచి దేశ అంతర్గత భద్రతకు ముప్పు కొత్తదేమీ కాదని ఆయన అన్నారు. వికీలీక్స్ వెల్లడించిన రాహుల్ గాంధీ తిమోతి రిమోర్స్ తో జరిపిన సంభాషణ వివరాలు కలకలం సృష్టిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X