• search
  • Live TV
ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణ ఉద్యమానికి డిజిపి అరవింద రావు హెచ్చరిక?

By Pratap
|
DGP Aravind Rao
ఒంగోలు: డిసెంబర్ 31వ తేదీ తర్వాత తెలంగాణలో తలెత్తే ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతామని పరోక్షంగా రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) అరవిందరావు హెచ్చరిస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. డిజిపి అరవిందరావు శనివారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు ఈ వ్యాఖ్యలు హెచ్చరికగా భావిస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని కోరుతూనే రెచ్చగొట్టే ప్రకటనలు చేసేవారిని కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. అంతర్యుద్ధం వంటి మాటలు వాడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కేంద్రం నుంచి బలగాలను తెప్పిస్తున్నట్లు, అయితే వాటిని అవసరం మేరకే తెప్పిస్తున్నామని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

డిసెంబర్ 31వ తేదీ తర్వాత అల్లర్లు చెరేగుతాయని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. విద్యార్థులను వేధిస్తున్నామని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తాము వేల మంది విద్యార్థులపై కేసులు పెట్టినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాము కేవలం 50మందిపైనే కేసులు పెట్టామని ఆయన చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని దాదాపు 6 వేల మంది విద్యార్థుల్లో 300 మంది సంఘవ్యతిరేకులు ఉన్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X