హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మధ్యంతర ఎన్నికలపైనే వైయస్ జగన్ గురి, కెసిఆర్ చూపు కూడా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: రాష్ట్రాన్ని మధ్యంతర ఎన్నికల దిశగా తీసుకుని వెళ్లే లక్ష్యంతో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పని చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మధ్యంతర ఎన్నికలు వస్తే సీమాంధ్ర మొత్తం స్వీప్ చేయవచ్చుననే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణను పక్కన పెట్టి కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడానికి అదే కారణమని కూడా భావిస్తున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు నాయకుడు గోనె ప్రకాశ రావు మాటలను బట్టి కూడా ఈ విషయం అర్థమవుతోంది. రాష్ట్ర శాననసభకు మధ్యంతర ఎన్నికలు రావచ్చునని గోనె ప్రకాశ రావు శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా మధ్యంతర ఎన్నికలనే ఆశిస్తారని ఆయన అన్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తే రాష్ట్రంలో కాంగ్రెసు తుడిచిపెట్టుకు పోతుందని ఆయన అన్నారు. సీమాంధ్రలో వైయస్ జగన్ పార్టీ స్వీప్ చేస్తుందని, తెలంగాణలో తెరాస స్వీప్ చేస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ మాటలను బట్టి కాంగ్రెసును దెబ్బ కొట్టడానికి కెసిఆర్, వైయస్ జగన్ ఒక్కటవుతారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గానీ ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గానీ తెలంగాణలోనే కాకుండా సీమాంధ్రలోనూ ఏమీ చేయలేరని వారు భావిస్తున్నారు. మధ్యంతర ఎన్నికలను పసిగట్టే రైతు సమస్యలపై చంద్రబాబు నిరాహార దీక్ష చేపట్టినట్లు భావిస్తున్నారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పరిస్థితులు రాష్ట్రంలో అదుపు తప్పే ప్రమాదం ఉందని కూడా భావిస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ తర్వాత తీవ్రమైన పరిణామాలుంటాయని, రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేయాలని వైయస్ జగన్ భావిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X