చంద్రబాబునాయుడు లోకేష్ ప్రకాశ్ కారత్ హైదరాబాద్ chandrababunaidu fasting lokesh prakash karat hyderabad
మూడో రోజుకు చేరిన చంద్రబాబు నాయుడు నిరవధిక దీక్ష

మూడోరోజు చంద్రబాబుతో పాటు వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు దీక్షలో కూర్చోనున్నారు. మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో దీక్షలు ప్రారంభమయ్యాయి. బాబును పరామర్శించడానికి తెలంగాణలోని పలు జిల్లాలనుండి వేలమంది కార్యకర్తలు తరలి వస్తున్నారు. వరంగల్ నుండి రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి ఆధ్వర్యంలో సుమారు 1500 మంది కార్యకర్తలు రానున్నారు.
కాగా శనివారం మాజీ ప్రధానమంత్రి దేవేగొడ, కమ్యూనిస్టు నాయకుడు ప్రకాశ్ కరత్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ యాదవ్ తదితరులు చంద్రబాబును కలిసి తమ సంఘీభావాన్ని తెలిపారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మిణి, బావమరిది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం సతీమణి భువనేశ్వరి దీక్షా శిబిరానికి చేరుకున్నారు.