హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబునాయుడు నిరవధిక నిరాహార దీక్షకు జయలలిత మద్దతు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayalalitha
హైదరాబాద్‌: మనోధైర్యాన్ని కోల్పోవద్దని, పోరాడి సమస్యలు ప్రభుత్వంద్వారా పరిష్కరించుకుందామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదివారం రైతులను కోరారు. ఆదివారం ఆయన నిరవధిక నిరాహారదీక్ష మూడో రోజుకు చేరుకున్న సందర్భంగా ఆయన రైతులనుద్దేశించి మాట్లాడారు. రైతులు అధైర్య పడవద్దని సూచించారు. నా దీక్షతోనన్న పాలకుల మనసు కరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. మీ సమస్యల పరిష్కారానికే నేను దీక్ష చేస్తున్నానన్నారు. అధైర్య పడి ప్రాణాలు కోల్పోకూడదన్నారు.

రైతుల కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమని అన్నారు. కాగా చంద్రబాబు దీక్షకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐడిఎంకే అధినేత్రి జయలలిత మద్దతు ప్రకటించారు. ఆమె తన తరఫున పార్లమెంటు సభ్యుడు సమ్మాళీని హైదరాబాద్ పంపించారు. ఆయన ఉదయం చంద్రబాబును పరామర్శించారు. కాగా చంద్రబాబు ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా ఉంది. ఆయన ఉదయం నుండి దీక్షా శిబిరంలో పడుకునే ఉన్నారు. శరీరంలో షుగర్ లెవల్సు పడిపోయాయి. ఆయన కాస్త నీరసించిపోయాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X