హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్స సత్యనారాయణను నిలువరించిన వైయస్ జగన్ సాక్షి డైలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi Daily2
హైదరాబాద్: రైతులకు తొమ్మిది గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తూ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సంతకం చేయలేదని చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణను మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి డైలీ నిలువరించింది. ఫైలుపై సంతకం చేయనే లేదనే బొత్స సత్యనారాయణ మాటలు తప్పని తేల్చేసింది. అయితే, సంతకమే చేయలేదని చెప్పిన బొత్స సత్యనారాయణ పైలుపై సంతకం చేసినా ఆ హామీ ఎందుకు అమలు కాలేదో వైయస్ జగన్ తండ్రి వైయస్సార్ రాజశేఖర రెడ్డికి తెలుసునని ఆయన తాజాగా శనివారం అన్నారు. ఫైలుపై వైయస్సార్ సంతకం చేసిన మాట నిజమేనని బొత్స అంగీకరించినట్లు సాక్షి దినపత్రిక రాసింది. బొత్స సత్యనారాయణ బుకాయించారని, నిజం అంగీకరించారని సాక్షి డైలీ విరుచుకుపడింది.

''2009 లో ప్రమాణ స్వీకారం రోజున 9 గంటల ఉచిత విద్యుత్ ఫైలుపై ఆనాడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి సంతకం చేశారు. ఆ ఖరీఫ్ నుంచి అమలు చేస్తామన్నారు. కానీ అమలు చేయలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితుల వల్ల చేయలేకపోయాం. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాక, విద్యుత్ ఉత్పాదన పెరిగాక అమలుచేద్దామన్నారు. ఆర్థికమాంద్యం, ఖజానా పరిస్థితిని పరిశీలించి వెసులుబాటుకు అవకాశాలపై అధికారులను అధ్యయనం చేయమన్నారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో వైఎస్ మాతో చెప్పారు. వైఎస్ నిర్ణయాల్లో మేమంతా భాగస్వాములం. నేను ఒకటి చెప్తే 'సాక్షి" మరో విధంగా అర్థం చే సుకొని నన్ను కించపరిచే విధంగా వ్యవహరించింది. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు"" అని బొత్స సత్యనారాయణ వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X