హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమస్యలపై పోరాటానికి చంద్రబాబుకు అండగా ఉంటా: అజిత్ సింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ajit singh
హైదరాబాద్: రైతు సమస్యలను పరిష్కరించాలంటూ నిమ్స్ లో నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని లోక్ దళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ సోమవారం పరామర్శించారు. ప్రభుత్వంపై రైతుల పక్షాన ఉండి పోరాడుతున్న చంద్రబాబును అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. రైతు సమస్యలపై చంద్రబాబు ధృడనిశ్చయంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. చంద్రబాబు వెంట మేము ఉంటామని ప్రకటించారు.

చంద్రబాబు దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేకిగా పని చేస్తుందన్నారు. తెలంగాణ సమస్య, రైతుల సమస్యను వేరువేరుగా చూడాలన్నారు. చంద్రబాబును అరెస్టు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులను అవమానించిందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X