హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళనగా ఉంది: జూనియర్ ఎన్టీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jr Ntr
హైదరాబాద్: రైతుల సమస్యలపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని చిత్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాం బుధవారం విలేకరులతో అన్నారు. రైతుల సమస్యలపై నిరవధిక నిరాహారదీక్ష చేపడుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రాం బుధవారం పరామర్శించారు. అస్సాం గణపరిషత్ ఉపాధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు జోసెఫ్ కూడా చంద్రబాబును పరామర్సించారు.

చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కొరకుగానీ, వారి కార్యకర్తలకుగానీ న్యాయం చేయమని ప్రభుత్వం ముందు డిమాండ్లు పెట్టి దీక్ష చేయడం లేదని జూనియర్ ఎన్టీఆర్ విలేకరులతో చెప్పారు. ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారం కోసం, బాబు దీక్షపై వెంటనే స్పందించాలన్నారు. దీక్ష విరమించమని తాము కోరినప్పటికీ రైతుల సమస్య పరిష్కారమయ్యే వరకు దీక్ష విరమించేది లేదని ఆయన కరాఖండిగా చెబుతున్నారని అన్నారు.

చంద్రబాబు దీక్షపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. ఇతర దేశాలలో రైతులకు ప్రాధాన్యత ఉంటుందని మరో హీరో కళ్యాణ్ రాం అన్నారు. అక్కడి రైతులు కార్లలో తిరుగుతారని కానీ ఇక్కడి రైతులకు తమ సమస్యలే పరిష్కారం కావటం లేదన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రిపై ప్రభుత్వం ఇలా వ్యవహరించటం సరికాదని అన్నారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి బాబు దీక్షను విరమించేలే ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X