• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జాతీయ నేతల విజ్ఞప్తితో చంద్రబాబు నిరాహార దీక్ష విరమణ

By Pratap
|

Chandrababu Naidu
హైదరాబాద్‌: రైతు సమస్యలపై గత ఎనిమిది రోజులుగా నిరవధిక నిరాహార దీక్షను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చేత విరమింపజేయడానికి జాతీయ నాయకులు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చారు. వివిధ పార్టీల నాయకుల విజ్ఞప్తి మేరకు చంద్రబాబు తన దీక్షను విరమించారు. రైతు సమస్యలపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడానికి వారు సమాయత్తమవుతున్నారు. ప్రకాష్ కారత్ (సిపిఎం), ఎబి బర్దన్ (సిపిఐ), శరద్ యాదవ్ (జెడియు), అజిత్ సింగ్ (ఆర్ఎల్డీ), ఓం ప్రకాష్ చౌతాలా (ఐఎన్ఎల్డీ), దేవరాజ్ (ఫార్వర్డ్ బ్లాక్), అరుణ్ కుమార్ శర్మ (ఎజిపి), వైగో (ఎండిఎంకె), దినేష్ (జెడిఎస్), అంబదురై, మైత్రేయ (అన్నాడియంకె) హైదరాబాద్ వచ్చి, దీక్ష విరమించాలని చంద్రబాబును కోరారు.

చంద్రబాబు దీక్షకు అన్నాడియంకె నేత జయలలిత, జెడిఎస్ నేత దేవెగౌడ, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ సంఘీభావం తెలిపారు. దీక్ష విరమించాలని వారు చంద్రబాబును కోరారు. రైతు సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధం కావాలని వారు సూచించారు. రైతు గర్జన పేరిట గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు తెలుగుదేశం, వామపక్షాలు సన్నాహాలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం దీక్ష విరమించారు. ఈ నెల 17వ తేదీ నుంచి చంద్రబాబు నిరాహార దీక్ష చేస్తున్నారు. జాతీయ స్థాయిలో రైతు ఐక్య ఉద్యమం చేపట్టేందుకు చంద్రబాబు దీక్ష విరమించారు. కొబ్బరి నీళ్లు తాగించి చంద్రబాబు చేత జాతీయ నాయకులు దీక్ష విరమింపజేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X