• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు: జలాలపై ఆంధ్రప్రదేశ్ కు ఎదురు దెబ్బ

By Pratap
|

Andhra Pradesh
న్యూఢిల్లీ‌: కృష్ణా జలాల పంపకంపై ఆంధ్రప్రదేశ్ కు కృష్ణా ట్రిబ్యునల్ వద్ద ఎదురు దెబ్బ తగిలింది. మిగులు జలాలను పంచడమే కాకుండా కర్ణాటకలోని ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంపునకు కృష్ణా ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కృష్ణా జలాలపై కృష్ణా ట్రిబ్యునల్ గురువారం తీర్పు వెలువరించింది. మిగులు జలాలపై ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ కు పూర్తి హక్కు ఉండేది. ఇప్పుడు ఆ హక్కును ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. అయితే, నికర జలాల వాటాను ఆంధ్రప్రదేశ్ కు పెంచింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, నాగార్జున డెల్టాల కింద, కెసి కెనాల్ కింద వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

కృష్ణా మిగులు, నికర జలాలను కృష్ణా ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్టల మధ్య పంచింది. మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్ కు 190 టిఎంసిలు, కర్ణాటకకు 177 టిఎంసిలు, మహారాష్ట్రకు 81 టిఎంసిలు కేటాయించింది. నికర జలాలను ఆంధ్రప్రదేశ్ కు 1001 టిఎంసిలు, మహారాష్ట్రకు 666 టిఎంసిలు, కర్ణాటకకు 911 టిఎంసిలను కేటాయించింది. చైన్నై తాగు నీటి అవసరాల కోసం మూడు రాష్ట్రాలు కూడా సరిసమానంగా నీటిని అందించాలని ఆదేశించింది. ఒక్కో రాష్ట్రం 7 టిఎంసిల చొప్పున కేటాయించాలని ఆదేశించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X