హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్దెలచెర్వు సూరి వాడిన కారు ఎన్నారై గారపాటి రత్నకుమార్‌ ది

By Pratap
|
Google Oneindia TeluguNews

Maddelacheruvu Suri
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్యకు గురైన సమయంలో వాడిన ఏపీ 28 డీఎఫ్‌ 1248 అనే నెంబర్ కారు గారపాటి రత్నకుమార్ అనే వ్యక్తిదని తెలుస్తోంది. కారు నెంబరు ఆధారంగా యజమాని వివరాలు ఆరా తీయగా... 'గారపాటి రత్నకుమార్‌, తండ్రి వెంకటరమణ, ఫ్లాట్‌ నెంబరు 71, లిలాక్‌ బ్లాక్‌, ఎల్‌ అండ్‌ టి ఫరీన్‌ కౌంటీ, టెలికం నగర్‌, గచ్చిబౌలి'గా ఆర్టీఏ కార్యాలయంలో తేలింది. కారు యజమాని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన రత్నకుమార్‌. ఎన్నారై. పదకొండు నెలల కిందట ఈయన హైదరాబాద్‌ నగరానికి వచ్చారు. తొమ్మిది నెలల కిందట టెలికం నగర్‌లో ఫ్లాటుతో పాటు ఈ స్కోడా కారు కొనుగోలు చేశారు. అయితే రత్నకుమార్‌ మూడు వారాల కిందట అమెరికాకు వెళ్లినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కారును తన మిత్రుడికి ఇచ్చి వెళ్లినట్లు సమాచారం. అయితే ఇంతకీ ఆ మిత్రుడు ఎవరు? అతడి నుంచి సూరికి ఈ కారు ఎలా వచ్చింది? అసలు రత్నకుమార్‌కు సూరి తెలుసా? ఇలాంటి అనుమానాలు నివృత్తి కావాల్సి ఉంది.

సూరి హత్యకేసు సెంట్రల్‌ క్రైం స్టేషన్‌కు (సీసీఎస్‌)కు బదిలీ చేసినట్లు హైదరాబాద్‌ కమిషనర్‌ ఎ.కె.ఖాన్‌ వెల్లడించారు. అదనపు పోలీస్‌ కమిషనర్‌(నేరాలు) ఉమాపతి ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. సూరిని చంపిన హంతకుడిని పట్టుకునేందుకు ఆరు బృందాల్ని నియమించినట్లు ఖాన్‌ తెలిపారు. సూరితో పాటు కారులో ఉన్న వ్యక్తే ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయని ఆయన వెల్లడించారు. కారు డ్రైవర్‌ ద్వారా కొంత విలువైన సమాచారం లభించినా అతను షాక్‌లో ఉన్నందున పూర్తి వివరాలు లభ్యం కాలేదన్నారు. డ్రైవర్‌ చెప్పిన ప్రకారం..సంఘటన సాయంత్రం 5 గంటల సమయంలో జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X