• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కారులో ఉన్నవారే సూరిని హత్య చేశారు: డిజిపి అరవిందరావు

By Pratap
|
DGP Aravind Rao
విజయవాడ‌: కారులో ఉన్నవారే మద్దెలచెర్వు సూరిని హత్య చేశారని ప్రాథమిక విచారణలో తేలిందని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) అరవింద రావు చెప్పారు. సూరి హత్య కేసులో కొన్ని ఆధారాలు లభించాయని, దర్యాప్తును ముమ్మరం చేశామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. సూరి డ్రైవర్ మధుసూదన్ రెడ్డి చెప్పిన వివరాలు ఎంత వరకు నిజమనేది దర్యాప్తుల తేలుతుందని ఆయన అన్నారు.

సూరి డ్రైవర్ చెప్పిన విషయాల ఆధారంగానే కాకుండా ఇతర కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. సూరి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న భాను పరారీలో ఉన్నాడని ఆయన చెప్పారు. సూరి ఉన్న కారులో ఎంతమంది ప్రయాణించారనేది దర్యాప్తులో తేలుతుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X