హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూరి హత్య: సుబ్బు కోసం గాలింపు, పోలీసుల అదుపులో గిరి

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదారబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న భాను కిరణ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అతని ఆచూకీ రాబట్టడానికి సుబ్బు అలియాస్ సుబ్బయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇతనే భాను కిరణ్‌ను తప్పించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సూరిని హత్య చేసిన తర్వాత సుబ్బు భానుకిరణ్‌ను తప్పించాడని అనుకుంటున్నారు. భాను కోసం పోలీసులు అంతర్జాతీయ విమానాశ్రయాలను అలర్ట్ చేశారు. చెక్ పోస్టుల వద్ద నిఘాను పెంచారు.

కాగా, భాను కిరణ్ సోదరుడు గిరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అతనితో పాటు మరో నలుగురిని కూడా పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. గుప్తా అనే వ్యక్తిపై పోలీసులు నిఘా పెట్టారు. గుప్తా భాను కిరణ్‌కు బినామీగా భావిస్తున్నారు. కాగా, ఓ ఫాక్షన్ లీడర్ అయిన సూరి హత్యకు అంత ప్రాధాన్యం ఇవ్వాలని డిజిపి అరవింద రావు మంగళవారం మీడియాకు సలహా ఇచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X