వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయవాడ సిపి సీతారామాంజనేయులుపై విచారణ: సిఎం కిరణ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: విజయవాడ పోలీస్‌ కమిషనర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని డీజీపీ అరవింద రావును ఆదేశించానని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ ‌రెడ్డి ఢిల్లీలో తెలిపారు. మహిళలకు అసభ్యకరమైన ఎస్ఎంఎస్‌లు పంపారంటూ సీపీపై ఓ ఛానల్‌లో బుధవారం ఆరోపణలు వచ్చాయి. ఆ విషయంపై స్పందిస్తూ సీఎం ఆ విధంగా చెప్పారు. సూరి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని కూడా ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

కాగా, ఆరోపణలను పరిశీలించిన తర్వాత విజయవాడ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులపై చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామని అరవింద రావు హైదరాబాదులో చెప్పారు.సమగ్రవిచారణ జరిపి అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. తనను ఉచ్చులోకి లాగడానికి తెలుగుదేశం కృష్ణా జిల్లా అధ్యక్షుడు వల్లభనేని వంశీ మహిళలను ప్రయోగించారని, తాను కూడా గేమ్ ఆడానని సీతారామాంజనేయులు అంటున్నారు. సీతారామాంజనేయులు వ్యాఖ్యలపై వంశీ తీవ్రంగా మండిపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X