చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వామి నిత్యానందతో రాసలీలపై నటి రంజిత బుకాయింపు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Ranjitha
చెన్నై: స్వామి నిత్యానందతో రాసలీలలపై సినీ తార రంజితది బుకాయింపేనని తెలుస్తోంది. తాను స్వామి నిత్యానందతో రాసలీలల్లో పాల్గొన్నట్లు బయటకు వచ్చిన టేప్ నిజం కాదని, అందులో ఉన్నది తాను కాదని రంజిత ఇటీవల మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పింది. రంజిత మాటలను సిఐడి అధికారులు కొట్టిపారేస్తున్నారు. రంజితతో శృంగారంలో పాల్గొన్నట్లు నిత్యానంద స్వామి స్వయంగా అంగీకరించినట్లు వారు చెబుతున్నారు.

తన బిదాడి ఆశ్రమంలో రంజిత ఏడాదికి పైగా ఉందని, తాను ఆమెతో చాలా సార్లు సెక్స్‌లో పాల్గొన్నానని నిత్యానంద నిరుడు ఏప్రిల్‌లో జరిగిన విచారణలో చెప్పినట్లు వారు తెలిపారు. తాను రంజితతో సెక్స్‌లో పాల్గొన్నట్లు నిత్యానంద చెప్పిన మాటలను రికార్డు చేసినట్లు కూడా వారు చెబుతున్నారు. తాను 15 మందికి పైగా మహిళలతో రాసలీలలు సాగించినట్లు, వారిలో రంజిత కూడా ఉన్నట్లు నిత్యానంద చెప్పాడని వారు తెలిపారు. తాము ఇంతకు ముందు విచారించినప్పుడు లెనిన్‌కు వ్యతిరేకంగా రంజిత ఒక్క మాట కూడా చెప్పలేదని వారంటున్నారు. వీడియో టేప్‌లు మార్ఫ్ చేసినవి కావని వారు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X