విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడ సిపి భానును వదలడంవల్లే సూరి హత్య: వల్లభనేని వంశీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vallabhaneni Vamsi
విజయవాడ: నగర పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులు తన వివాదంలోకి అనవసరంగా లాగుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీ బుధవారం ఓ టీవీ కార్యక్రమంలో విమర్శించారు. ఓ మీడియా బయట పెట్టిన వార్తలను నాకు ఆపాదించడం సబబు కాదన్నారు. నన్ను కావాలనే వివాదంలోకి లాగుతున్నారన్నారు. అన్నపూర్ణ ప్యాకేజ్ గొడవలో సిపి నిమ్మకుండి పోయారని ఆరోపించారు. భానుకిరణ్‌ను ముందే అరెస్టు చేసి ఉంటే మద్దెలచెర్వు సూరి బతికి ఉండే వాడని ఆరోపించారు. ఇటీవల వివాదాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులను కౌన్సెలింగ్ పేరుతో పిలిచి వేధించారన్నారు. కావాలనే నాకు గన్‌మెన్‌లను ఆయన ఉపసంహరించుకున్నారన్నారు.

నెహ్రూ వర్గానికి వంత పాడారని ఆరోపించారు. నాపై ఆరోపణలు చేసినందుకే నేను బయటకు వచ్చానని, లేదంటే నాకు ఈ విషయంతో సంబంధం లేదన్నారు. కమిషనర్‌ను పొలిటికల్‌గా దెబ్బ తీయాల్సిన అవసరం నాకు లేదన్నారు. కమిషనర్ నన్ను చాలాసార్లు బెదిరించారని వంశీ ఆరోపించారు. ఆయనకపై కోర్టు ధిక్కారణ కేసు వేస్తానన్నారు.కమిషనర్ ఓ ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే నన్నారు. ఆయన విజయవాడకు బాస్ కాదని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యతలు మాత్రమే ఆయనపైన ఉన్నాయన్నారు. అందరికీ వ్యక్తిగత అలవాట్లు ఉంటాయని, అయితే అవి ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదన్నారు.

ఎంతోమంది ఉండగా ఈయనపైనే ఆరోపణలు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. గవర్నర్ నరసింహన్, డిజిపి అరవిందరావు ఉన్నంత కాలం తనను ఏవరూ ఏమీ చేయలేరని ఆయన వ్యాఖ్యానించినట్టు చెప్పారు. సిపితో వ్యక్తిగత విభేదాలు తనకు లేవని, ఆయనను ట్రాప్ చేయాల్సిన అవసరం కూడా తనకు లేదన్నారు. ఆరోపణలు చేసిన డాక్టర్ తనకు బంధువేనని అయినంత మాత్రాన నాకు ఇందులో సంబధం ఏమిటన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X