కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుకు దెబ్బ మీద దెబ్బ: టీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam
కరీంనగర్: జిల్లాకు చెందిన చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యుడు సుద్దాల దేవయ్య ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు రోజులు క్రితం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు సుద్దాల దేవయ్య, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన జూక్కల్ శాసనసభ్యుడు హనుమంతు షిండే కూడా టిఆర్ఎస్‌లో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. వెంటనే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, సీనియర్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి వారికి ఫోన్లు చేసి బుజ్జగించారు. దాంతో షిండే, సుద్దాల మంగళవారం ఆ వార్తలను కొట్టి పారేశారు. తెలుగుదేశం పార్టీలో ఉండి తాము తెలంగాణ కోసం పోరాడుతామని చెప్పారు. పార్టీని వీడేది లేదని ప్రకటించారు.

అయితే ఈ తీరుతో తెలుగుదేశం పార్టీ కొంత ఊపిరి పీల్చుకోగా, టీఆర్ఎస్ ఖంగుతిన్నది. చివరకు గజ్జెల కాంతంని మధ్యవర్తిగా సుద్దాల వద్దకు టిఆర్ఎస్ పంపినట్టు తెలుస్తోంది. సుద్దాలతో ఉదయంనుండి చాలాసేపు గజ్జెల కాంతం చర్చలు జరిపారు. ఆయన చర్చలు ఫలించినట్టున్నాయి. కాస్త ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. ఆలోచిస్తానని చెప్పినప్పటికీ చర్చల ఫలించాయని, ఆయన టిఆర్ఎస్‌లో చేరే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నట్టు సమాచారం. వారం రోజుల్లో ఆయన టిఆర్ఎస్ లోకి చేరే అవకాశాలు ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X