చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నటుడు విజయ్‌ కుమార్‌ కి గుండెనొప్పి: ప్రైవేటు ఆసుపత్రికి తరలింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijay Kumar
చెన్నై: ఇటీవల కుటుంబ వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖ సినీ నటుడు విజయ్‌ కుమార్‌ కు బుధవారం మధ్యాహ్నం గుండెనొప్పి వచ్చింది. ఆయనకు గుండెనొప్పి రావటంతో ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. గత కొంతకాలంగా విజయ్‌కుమార్ కుటుంబ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. తన మనవడి విషయమై కూతురు వనితతో చైన్నై విమానాశ్రయంలోనే గత డిసెంబర్ 29న తీవ్ర ఘర్షణకు దిగారు.

తన అల్లుడు అరవింద్ తనకు మనవడిని అప్పగించి వెళ్లాడని కూతురుకు అప్పగించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. విజయ్‌ కుమార్ కూతురు వనిత ఆ సమయంలో తండ్రిని తీవ్రంగా దూషించింది. తన కొడుకు శ్రీహరిని తనకు అప్పగించాలని తండ్రితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర ఒత్తిడికి గురైనట్టు తెలుస్తోంది. దీంతో ఆయన బుధవారం గుండెనొప్పి బారిన పడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X