హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే: నాగం జనార్ధన్‌రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan reddy
హైదరాబాద్: తెలంగాణ అంశంపై కమిటీ నివేదిక ఎలా ఇచ్చినప్పటికీ నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం కేంద్రమే అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్‌రెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. శ్రీకృష్ణ కమిటీ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నివేదికను ఇస్తానని చెప్పి అంతా గందరగోళంగా ఉన్న నివేదికను ఇచ్చిందన్నారు కమిటీ చేసిన ఆరు సిఫార్సుల్లో ఒకే ఒక సూచన తమకు సబబుగా ఉందన్నారు. 1956 నవంబర్ 1వ తేదికి ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యదాతథంగా ఉంచాలన్నారు. అందులో హైదరాబాదును కూడా కలుపుకుంటేనే మాకు సమ్మతం అని స్పష్టం చేశారు.

కమిటీని సూచించిన మిగిలిన వాటిని తాము పరిగణలోకి తీసుకోవటం లేదన్నారు. కమిటీ సభ్యులు వారి పరిధి దాటి సూచనలు చేశారన్నారు. ఇంత సమయాన్ని, ఇన్ని కోట్లు ఖర్చు చేసి ఇచ్చిన నివేదిక విలువలు లేని రిపోర్టుగా తయారయిందన్నారు. కమిటీ నివేదిక తెలంగాణ ప్రజల మనోభావాలను, తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ఉన్నాయన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఫజల్ అలీ కమిటీ నివేదికకు పూర్తి భిన్నంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల వాదనలు నిజమని శ్రీకృష్ణ కమిటీ చెబుతూనే మళ్లీ ప్రత్యేక బోర్డులు అనటం ఏమిటని ప్రశ్నించారు. ప్రత్యేక బోర్డులు ఏవీ మాకు వద్దని, కేవలం ప్రత్యేక రాష్ట్రమే కావాలన్నారు.

చివరి నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని, అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కావాలని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా రానున్న పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో మోహరించిన పోలీసు బలగాలను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే శాంతియుతంగా ఉద్యమాలు చేపడతామని, తమను పోలీసు బలగాలు ఏమీ చేయలేవన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక్కడి అన్ని పార్టీలు ఏకమై పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X