నివేదికపై మాలాంటి వృద్ధులకే ఇంత పౌరుషం వస్తుంది: ఉప్పునూతల
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: ఇంతటి మోసాన్ని తాను ఎన్నడూ చూడలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి గురువారం విలేకరులతో అన్నారు. శ్రీకృష్ణ నివేదిక బహిర్గతం అనంతరం ఆయన మాట్లాడారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక ఎందుకు పని చెయ్యదని ధ్వజమెత్తారు. మాలాంటి వృద్ధులకే ఆ నివేదికను చూస్తుంటే పౌరుషం తన్నుకు వస్తుందని, ఇక యువతకు ఎలా ఉంటుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ వారు వెంటనే పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నేతలు పదవులు వదులుకోకుంటే ప్రజలు ఊళ్లలో తిరగనివ్వరని హెచ్చరించారు. రాజీనామా విషయమై కాంగ్రెస్ పార్టీ నేతలు ఉపేక్షించద్దన్నారు. ఇక తెలంగాణ కోసం రాష్ట్ర ప్రజలు, పార్టీలు అందరూ కలిసి ఉద్యమించాలని ఆయన సూచించారు. పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు.