హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒయు శాంతిభద్రతలపై అపోహలు ప్రచారం: డిజిపి అరవిందరావు

By Pratap
|
Google Oneindia TeluguNews

Aravinda Rao
హైదరాబాద్: హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం శాంతిభద్రతలపై అపోహలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) అరవిందరావు అన్నారు. గురువారం రాత్రి ఉస్మానియాలో కాల్పులు జరగలేదని, భాష్పవాయువు ప్రయోగం మాత్రమే జరిగిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. విద్యార్థులు రాళ్లదాడి చేశారని, ఈ దాడిలో 24 మంది పోలీసులు గాయపడ్డారని ఆయన చెప్పారు. ఉస్మానియాలో ఉద్రిక్తత ఉందని, అయితే అదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.

హైదరాబాదులో ఆరు కేసులు నమోదు చేశామని, జిల్లాల్లో కొన్ని కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. గంపగుత్త మొబైల్ సందేశాలను నిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు. గంపగుత్త మొబైల్ సందేశాలు పరిస్థితిని విషమింపజేసే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. తాము బుల్లెట్లను వాడడం లేదని, ప్యాలెట్లను మాత్రమే వాడుతున్నామని ఆయన చెప్పారు. బుల్లెట్ గాయాలతో ఎవరూ ఆస్పత్రి పాలు కాలేదని ఆయన చెప్పారు. ఏమో జరిగిపోతోంది, తాము కవర్ చేయడం లేదనే పద్ధతిలో మీడియా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. సూరి హత్య కేసులో భాను కిరణ్ పట్టుబడలేదని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X