• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఉద్రిక్తతమవుతున్న తెలంగాణ: రాజకీయ నేతల ఇళ్లు ముట్టడి

By Pratap
|

Telangana
హైదరాబాద్: శ్రీకృష్ణ కమిటీ నివేదికకు వ్యతిరేకంగా హైదరాబాదుతో పాటు అన్ని తెలంగాణ జిల్లాల్లో నిరసన పెల్లుబుకుతోంది. ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెసు నాయకులపై ఆందోళనకారులు భగ్గుమంటున్నారు. తెలంగాణలో ఆ పార్టీల నాయకులు తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. హైదరాబాదులోని ఉస్మానియా, వరంగల్లులోని కాకతీయ విశ్వవిద్యాలయాలు ఉద్రిక్తంగా మారాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గురువారం రాత్రి నుంచి మధ్యమధ్యలో కాల్పులు జరుగుతున్నాయి. మీడియాను పోలీసులు ఉస్మానియా ఆవరణలోకి అనుమతించడం లేదు. కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి వాసుదేవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు.

నిజామాబాద్‌లో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ ఇంటిని ఆందోళనకారులు ముట్టడించారు. రాజీనామా చేయాలని ఆయనను డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్‌ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి సుదర్శన్ రెడ్డి రాజీనామా చేయాలని నిజామాబాద్‌ జిల్లాలో ర్యాలీలు నిర్వహించారు. మెదక్ జిల్లాలో మంత్రులు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ ఇంటిని ముట్టడించారు.

ఖమ్మం జిల్లాలో సింగరేణి కార్మికులు ర్యాలీ నిర్వహించారు. శ్రీకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వరంగల్లులో విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. వరంగల్లులో కోర్టులకు తాళాలు వేశారు. ఎంజిఎం ఆసుపత్రి ముందు నర్సులు ఆందోళనకు దిగారు. అన్ని జిల్లాల్లోనూ ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతున్నాయి. విద్యాసంస్థలను మూసేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X