హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూరి హత్య: భాను కిరణ్ సినీ లింక్స్, ల్యాప్ టాప్ కీలకం

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: దారుణహత్యకు గురైన మద్దెలచెర్వు సూరి నివసిస్తున్న మాదాపూర్‌లోని అలేఖ్య అపార్ట్‌మెంట్స్‌లో సీసీఎస్ అధికారులు నిర్వహించిన సోదాల్లో ఓ ల్యాప్‌టాప్ లభించింది. అయితే దానికి యాక్సిస్ లాక్ ఉండటంతో తెరవడం పోలీసులకు సాధ్యం కాలేదు. దీన్ని ఓపెన్ చేస్తే సూరి ఆర్థిక లావాదేవీలు, ఇతర వ్యవహారాలకు సంబంధించిన కీలకాంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైబర్ నిపుణులు లేదా ఫోరెన్సిక్ నిపుణులతో ల్యాప్‌టాప్‌ను ఓపెన్ చేయించి అందులోని డేటా ఎనాలసిస్ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న భానుకు సినీరంగంతో దగ్గరి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సూరికి బినామీగా ఉన్న భాను పెద్ద మొత్తంలో సినీరంగంలో పెట్టుబడులు పెట్టినట్లు, కొందరు నటీమణులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భానుకు సినీరంగంతో ఉన్న పరిచయాలు, వ్యవహారాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అలేఖ్య అపార్ట్‌మెంట్స్‌లోని ఫ్లాట్ సైతం ఓ నిర్మాతదని తెలుస్తోంది.

ఫ్లాట్‌లో వంటమనిషిగా పనిచేస్తున్న కూకట్ ‌పల్లికి చెందిన ప్రసాద్‌ను ప్రశ్నించగా సూరి తదితరులు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఈ ఫ్లాట్‌లోనే ఉంటారని, వారికి అవసరమైనవి సమకూర్చాల్సిందిగా సినీ నిర్మాత చెప్పినట్లు తెలిపాడని ఓ ప్రముఖ దినపత్రిక రాసింది. భానుకు సినీరంగంతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు గురు, శుక్రవారాల్లో ఇద్దరు నిర్మాతలను ప్రశ్నించారు. మరోవైపు భానుకు బెంగళూరులోనూ కొన్ని ఆస్తులు ఉన్నట్లు అనుమానిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఓ ప్రత్యేక బృందం అక్కడకు బయలుదేరి వెళ్లింది. సూరి హత్యకు గురైన సమయంలో కారు డ్రైవర్‌గా వ్యవహరించిన మధుమోహన్ సైతం వీరితో వెళ్లాడు. భాను కిరణ్‌తో సంబంధాలను ఆ నిర్మాతలు ఖండిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X