హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యార్థులపై పోలీసుల దాడిని వెంటనే ఆపాలి: ఎంపీ మంద జగన్నాథం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manda Jagannadham
హైదరాబాద్: విద్యార్థులపై పోలీసులు దాడిని వెంటనే ఆపాలని పార్లమెంటు సభ్యుడు మంద జగన్నాథం ఆదివారం హోంమంత్రి సబితారెడ్డితో భేటీ అనంతరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. విద్యార్థులు ఆవేశంలో ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదన్నారు. ఆత్మహత్యలకు పూనుకోవద్దన్నారు. ఉస్మానియాలోకి మీడియాలను అధికారికంగా అనుమతించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎంపీ వివేక్ డిమాండ్ చేశారు.

తెలంగాణ ఉద్యమం కారణంగా చిక్కుల్లో ఇరుక్కు పోయిన తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు మంద జగన్నాధం, వివేక్ తదితరులు హోంమంత్రి సబితారెడ్డితో ఆదివారం ఉదయం భేటీ అయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కేంద్ర బలగాలను మోహరించకూడదని వారు సబితారెడ్డిని కోరారు. వారి డిమాండ్‌కు సబితారెడ్డి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో భేటీ తర్వాత పూర్తి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినట్టుగా తెలుస్తోంది.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసులు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని, కేంద్ర బలగాల మోహరింపును వెంటనే వెనక్కు పిలవాలని వారు కోరారు. సంక్రాంతి సెలవుల పేరుతో విద్యార్థులను ఇంటికి పంపించే కుట్రలు పన్నుతున్నారని దానిని అడ్డుకోవాలని కోరారు. మెస్‌లు తెరవడానికి హోంమంత్రి అంగీకరించినట్టు తెలిపారు. మీడియాను విశ్వవిద్యాలయంలోకి అనుమతించాలని కోరారు. రబ్బరు బుల్టెట్లు, పుల్లెట్లు వాడకూడదని వారు సబితారెడ్డిని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X